స్పష్టం చేసిన సౌరభ్ గంగూలీ

కరోనా వైరస్ కారణంగా ఈసారి యూఏఈలో నిర్వహించే ఐపీఎల్లో మహిళల మ్యాచ్లు కూడా ఉంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆదివారం స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 19 నుంచి గల్ఫ్ దేశాల్లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో కచ్చితంగా అమ్మాయిలకు చోటిస్తామని పేర్కొన్నాడు. ఆ విషయంలో బీసీసీఐ కట్టుబడి ఉందని, వారిని నాలుగు జట్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపారు.

మరోవైపు ఐపీఎల్ పదమూడో సీజన్ వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే విషయంపై స్పష్టత వచ్చినా, ఫైనల్ మ్యాచ్ తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంతో పాటు టోర్నీ నిర్వహణకు సంబంధించి, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఐపీఎల్ పాలకమండలి నేడు సమావేశం కానుంది. అందులో అన్ని విషయాలపైనా సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మహిళల మ్యాచ్లు నిర్వహిస్తామని, నవంబర్ 1 నుంచి 10 తేదీల మధ్య అవి ఉంటాయని ఓ అధికారి వెల్లడించాడు.
