ముగ్గురిలో మహేశ్‌ విలన్‌ ఎవరవుతారో?

Spread the love

‌ హీరో సినిమా అంటే హీరో సరితూగే హీరోయినే కాదు… విలన్‌ కూడా అవసరం. విలన్‌ బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర బాగా పండుతుంది అంటుంటారు కదా… అందుకే దర్శకనిర్మాతలు విలన్ల విషయంలో చాలా ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్‌ హీరో సినిమా గురించి ఇలాంటి తర్జనభర్జనలే జరుగుతున్నాయంట. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఆసక్తిపెంచిన ‘సర్కారు వారి పాట’ గురించే ఇదంతా.

చెవి పోగు, మెడ మీద రూపాయి బిళ్ల టాటూ, టైటిల్‌, దాంట్లో వాడిన గంట… ఇలా అన్నీ సినిమా మీద ఆసక్తిని పెంచేశాయి. దర్శకుడు పరశురాం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంటున్నారట. మహేశ్‌ సరసన నటించే నాయికగా కీర్తి సురేశ్‌ ఇప్పటికే ఫిక్స్‌ అయిపోయింది. ఈ విషయాన్ని ఆమెనే తెలిపింది. ఇక థమన్‌ సంగీతమందిస్తాడని ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు విలన్‌ వంతు వచ్చింది. ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉంటుందట. మరి ఆ పాత్రలో ఎరు నటిస్తారనేదే ప్రశ్న.

మహేశ్‌కు విలన్‌గా ఎంపిక చేయడానికి చిత్రబృందం మూడు పేర్లు పరిశీలనలో పెట్టిందని తెలుస్తోంది. దీని కోసం అరవింద్‌ స్వామి, ఉపేంద్ర, సుదీప్‌ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ ముగ్గురు ఎంతమంచి నటులో మనకు తెలిసిందే. మరి వీరిలో మహేశ్‌ను ముప్పతిప్పలు పెట్టి.. హీరోయిజాన్ని బయటకు లాగే విలన్‌ ఎవరవుతారో చూడాలి. లేకపోతే ఈ ముగ్గురు కాకుండా బాలీవుడ్‌ నుంచి ఇంకెవరినైనా తీసుకొస్తారేమో తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *