ప్రపంచంలో ఎంతటి జట్టు ఐనా ప్రస్తుత టీమిండియా ముందు తిరుగులేదు అని తెలిపారు. ప్రస్తుతం భారత్ బౌలింగ్ కఠినంగా వుంది. వారి దెబ్బకు ఏ జట్టు
అయినా టీమిండియా బౌలింగ్ ముందు చిత్తు అవుతుంది అని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.

బూమ్రా,ఇషాంత్,షమీల ఫేస్ బౌలర్లుకి తిరుగులేదు. తక్కువ స్కోర్ కి పరిమితం కావడం తప్పదు అంటున్నాడు మన స్వాన్. ప్రపంచంలోనే ఉత్తమమైన బౌలింగ్ అని భారత్ బౌలింగ్ కి ఎదురు లేదు అని మన కుర్రాళ్ల మిద ప్రశంసలు కురిపించారు.ఇలా ఎందుకు అన్నాడా అనుకోవచ్చు గతంలో వెస్టిండీస్ లో భారత్ పర్యటన సందర్బంగా స్వాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ఫేసరలు 40లో 33 వికెట్లు తియ్యడం విశేషం.