
రోహిత్ శర్మ ఎంతటి గొప్ప ఆటగాడో మన అందరికీ తెలిసిన విషయమే, తను కొట్టె సిక్స్ లు చూసి అభిమానులు తనకి ముద్దుగా “హిట్ మాన్” అనే పేరు పెట్టి పిలిచుకుంటున్నారు. రోహిత్ శర్మ హిట్టింగ్ తో పాటు కెప్టెన్సీ కూడా బాగా చేస్తాడని అండ్ ఇండియా కి ఫ్యూచర్ ధోని రోహిత్ యేనని తన తోటి ఆటగాడు అయిన రైనా స్పష్టం చేశాడు. రోహిత్ కూడా అచ్చం ధోని లానే మైదానం లో ప్రశాంతంగా ఉంటాడని సహచర ఆటగాళ్ల సలహాల సూచనలు తీసుకుని వాళ్ళలో ఇంకా నమ్మకాన్ని పెంచుతాడని రైన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
బంగ్లదేశ్తో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ కెప్టెన్సీ లో నేను ఆడాను తను యువ క్రికెటర్లు ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అంతేకాకుండా తన మాటలతో వాళ్ళలో స్ఫూర్తి ని నింపేవాడని రైనా అన్నారు. అంత కూల్ గా ఉంటాడు కాబట్టే రోహిత్ ధోనీ కంటే ఎక్కువ IPL ట్రోఫీ లు గెలవగలిగాడని రైనా అభిప్రాయపడ్డారు.ఫైనల్ గా రైనా తన ఇంటర్వ్యూ ముగిస్తూ కూడా మరొకసారి ఇండియన్ క్రికెట్ టీం ఫ్యూచర్ “ధోని” “రోహిత్” యెనని నొక్కి వక్కాణించారు.