
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బర్త్ డే నేడు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో దేవీకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. దేవీ కంపోజిషన్లో వచ్చిన పాటలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో దేవీ పాటలు అంతగా ఆకట్టుకోవడం లేదనే టాక్ వచ్చింది. దేవీ నుంచి ఆశించిన పాటలు రావడం లేదనే నిరాశలో శ్రోతలుండగా.. ఉప్పెన పాటలు వచ్చాయి. ఈ చిత్రంలోని నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నేడు దేవీ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులంతా విషెస్ తెలిపాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మెమరబుల్ సాంగ్స్ ఇచ్చిన దేవీకి మహేష్ బాబు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక బన్నీ,దేవీది ఆర్య నుంచి మొదలైన బంధం. బన్నీ సినిమాల్లో దాదాపు సగానికి పైగా చిత్రాలకు దేవీయే సంగీతాన్ని సమకూర్చాడు. రాబోయే పుష్ప చిత్రానికి కూడా కుమ్మేద్దాం అంటూ దేవీ ట్వీట్ చేశాడు.
నేడు దేవీ బర్త్ డే సందర్భంగా ఆయనకు ఓ అద్భుతమైన బహుమతి ఉప్పెన రూపంలో దొరికింది. ఈ సాంగ్కు యూట్యూబ్లో వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. దేవీకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక రాబోయేది దేవీ హవానే అని ఉప్పెన, రంగ్ దే, పుష్ప చిత్రాలతో తెలుస్తోంది. ఇంత వరకు రేసులో కాస్త వెనకబడ్డట్టు దేవీ కనిపించినా.. మళ్లీ పూర్వ వైభవం రానున్నట్టు కనిపిస్తోంది.
