మహేశ్‌బాబు పుట్టినరోజున మ్యూజికల్‌ సర్‌ప్రైజ్

Spread the love

మహేశ్‌బాబు పుట్టినరోజున (ఈ నెల 9) ఆయన అభిమానుల కోసం ఓ మ్యూజికల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారట ‘సర్కారువారి పాట’ చిత్రబృందం. సూపర్‌ స్టార్‌ కష్ణ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను (సర్కారువారి పాట), మహేశ్‌ ప్రీ–లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఓ వీనుల విందైన ట్యూన్‌ని ఆగస్ట్‌ 9న వినిపించబోతున్నారట. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌ బాబు, కీర్తీ సురేష్‌ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లల్స్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఓ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ అనన్యా పాండే నటిస్తారని సమాచారం. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *