కరణం మల్లీశ్వరిగా రకుల్‌ ప్రీత్‌?

Spread the love

ఒలింపిక్స్‌లో మనకు పతకాన్ని తీసుకొచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. తాప్సీ కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు తెరమీదకొచ్చింది. మల్లీశ్వరి, రకుల్‌ ప్రీత్‌ల బాడీలాంగ్వేజ్‌ చాలా భిన్నంగా ఉంటుంది. మరి రకుల్‌ని ఫైనలైజ్‌ చేస్తే ప్రోస్థెటిక్‌ మేకప్‌తో లుక్స్‌ని మ్యాచ్‌ చేస్తారేమో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *