
చియాన్ విక్రమ్‌కు తమిళనాటే కాదు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఒకప్పుడు ఈయన సినిమాలకు ఇక్కడ కూడా అదిరిపోయే మార్కెట్ ఉండేది. 15 ఏళ్ల కిందే అపరిచితుడు లాంటి సినిమాలతో తెలుగులో రచ్చ చేసాడు. అయితే కొన్నేళ్లుగా విక్రమ్ సినిమాలకు అంతగా ఆదరణ దక్కట్లేదు. వరస పరాజయాలతో ఈయన కెరీర్ డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం ఈయన ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అజయ్ ఙ్ఞానముత్తు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన కోబ్రా ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది.
ఇందులో విక్రమ్ 20 గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ కూడా ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకప్పుడు ఇండియన్ టీంలో చక్రం తిప్పిన ఈ క్రికెటర్.. ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు. ఇప్పటికే హర్భజన్ సింగ్‌తో పాటు చాలా మంది క్రికెటర్స్ కూడా సినిమాలు చేసారు. ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా తెరంగేట్రం చేస్తున్నాడు.
What an Interpol officer doing in Kolkata?? #shoot #movie #cobra #throwback @AjayGnanamuthu pic.twitter.com/0pucSw5VLH
— Irfan Pathan (@IrfanPathan) July 26, 2020
తాజాగా దర్శకుడు అజయ్ ఙ్ఞానముత్తు కూడా ఇర్ఫాన్ పఠాన్ సినిమా ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈయన మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమాలో ఓ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్ర ఉందని.. అది సినిమాలో చాలా ముఖ్యమైందని తెలిపాడు. ఈ పాత్రలో నటించడానికి భారత మాజీ స్టార్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పాడు అజయ్. ఈ మధ్యే భారత బౌలర్ హర్భజన్ సింగ్.. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి ఫ్రెండ్ షిప్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో కూడా ఓ తమిళ సినిమా చేసాడు.