టాలీవుడ్ టాప్ నిర్మాతకు చుక్కలు.. భారీగా ఏఆర్ రెహ్మాన్ రెమ్యునరేషన్..

Spread the love

ప్రభాస్ అంటే ఇక అలాంటి సినిమాలే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో పెరిగిపోతోందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం ప్రభాస్ సినిమాలు అంతకు మించి అనేలా రూపొందుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా భారీ బడ్జెట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. సాహోతో కాస్త తడబడినప్పటికి ప్రభాస్ మళ్ళీ పెద్ద సినిమాలతోనే ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమా కోసం ఏఆర్.రెహమాన్ ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన రెమ్యునరేషన్ మాత్రం ఊహించని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ అంటే ఇక అలాంటి సినిమాలే..

ప్రభాస్ అనగానే పాన్ ఇండియా సినిమా రాబోతోందని ఇక నుంచి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాధేశ్యామ్ తో పాటు వైజయంతి ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్ఛన్ సినిమా కూడా పాన్ ఇండియా తరహాలోనే రూపొందనుంది. నెవర్ బిఫోర్ అనేలా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ కొంచెం మ్యూజిక్ విషయంలో కూడా చిత్ర యూనిట్ తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాడు.

సాహో తరహాలో కాకుండా

సాహో తరహాలో ఇద్దరు ముగ్గురితో మ్యూజిక్ చేయించకుండా వీలైనంత వరకు నెక్స్ట్ సినిమాలకు ఒక్కరితోనే మ్యూజిక్ చేయించాలని అనుకుంటున్నాడు. మొన్నటివరకు రాధే శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా మందిని అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వడం లేదు. ఇక ఫైనల్ గా ఏఆర్.రెహమాన్ ని సెలెక్ట్ చేసుకోవాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రెహమాన్ కోసం చర్చలు

ఏఆర్.రెహమాన్ మ్యూజిక్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. ఎన్నో సార్లు రెహమాన్ తో మ్యూజిక్ చేయించుకోవాలని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ కి అయితే రెహమాన్ కరెక్ట్ గా సెట్టవుతాడాని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన రెమ్యునరేషన్ గురించి కాస్త ఆలోచిస్తున్నట్లు సమాచారం,

AR Rahman భారీ రెమ్యునరేషన్?

రెహమాన్ దాదాపు 4.5కోట్ల వరకు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ మన దగ్గర ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవిశ్రీప్రసాద్ వంటి వారు రెండుకోట్ల లోపే వస్తారు. ఇక కీరవాణి కూడా అందుబాటులో ఉన్నాడు. పైగా రెహమాన్ గతంలో మాదిరిగా పాటలతో వండర్స్ అయితే క్రియేట్ చేయడం లేదు. మరి రాధే శ్యామ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *