సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం: ఏపీ సీఎం జగన్

Spread the love

ఆగస్ట్ 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పూర్తి చేయాలి

ఈ పనులపై రెండు రోజులకు ఒకసారి కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి

ఆగస్ట్ 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తాం

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ఏడాది ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 5వ తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి జగన్ ఈరోజు తెలిపారు. ఆగస్ట్ 31వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు-నేడు పనులపై ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *