డబుల్ ధమాకా ప్లాన్ చేసిన బిగ్ బాస్: ఈ సీజన్‌లో ఇద్దరు హాట్ యాంకర్లతో రచ్చ!

Spread the love

ఫోటోలు బయటకు.. హోస్ట్ ఎవరో క్లారిటీ

నాలుగో సీజన్‌కు సంబంధించి తెరపైకి వచ్చిన ఊహాగానాల్లో ఎక్కువ శాతం హోస్ట్ గురించే ఉన్నాయి. దీనికి మరో హీరో హోస్ట్ చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, తాజాగా అక్కినేని నాగార్జున షూటింగ్‌లో పాల్గొన్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో నాలుగో సీజన్‌ను ఆయనే హోస్ట్ చేయబోతున్నాడని అందరికీ క్లారిటీ వచ్చేసింది.

డబుల్ ధమాకా ప్లాన్ చేసిన బిగ్ బాస్

కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్‌ -4లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం… ఈ సీజన్‌లో ఇద్దరు హాట్ యాంకర్లు పాల్గొనబోతున్నారట. వాళ్లెవరో కాదు… ‘పోవే పోరా’ ఫేం విష్ణు ప్రియ, ‘రాఖీ’ ఫేం మంజూష అని టాక్.

ఇద్దరు హాట్ యాంకర్లతో రచ్చ.!

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న యాంకర్లలో విష్ణు ప్రియ, మంజూష ఇద్దరూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లే. అందుకే వీళ్లిద్దరినీ ఈ సీజన్‌ కోసం తీసుకున్నారని సమాచారం. ఈ ఇద్దరు యాంకర్లు అల్లరితో రచ్చ రచ్చ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక, వీళ్లతో పాటు పూనమ్ బజ్వా, హేమచంద్ర, నందూ, రఘు మాస్టర్, మంగ్లీ తదితరులు ఇందులో పాల్గొంటారని వినికిడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *